Sri suktha Rahasyardha pradeepika    Chapters   

శ్రీదేవీభాగవత గద్యనువాద ముఖ్యానేక కృతికర్తలు, శ్రీవిద్యాభిషిక్తులు.

బ్రహ్మశ్రీ సరిపల్లె విశ్వనాథశాస్త్రి, ఎమ్‌. ఏ.,

లెక్చరర్‌, నైజామ్‌ కాలేజ్‌, సికంద్రాబాద్‌. 6-10-52.

శ్రీ శ్రియానందనాథకృతి -

శ్రీ సూక్త ప్రకటరహస్యార్థ వివరణము.

శ్రీదము, సకల కల్యాణప్రదము, నిహపరసాధకంబగు నట్లార్షముక్తాసూక్తంబులు, పులుగడిగిన ముత్తియము లట్ల నిత్యసంశోధితంబులు, సదా నిర్మలములు నయి యొప్పారి, నవనవార్థస్ఫూర్తి కాలవాలమ్ములై యెసలారునవి. చిత్త నైర్మల్యమునకుం దోడ్పడి, యాధ్యాత్మిక విద్యావిభూతి నిచ్చు నేకైక లక్ష్యమునకే భారత శారద మూర్తీ భవించినది. సంప్రదాయ సిద్ధములైన దార్శనిక సిద్ధాంత సారము లుపనిషద్వాక్యాను సరణి విడువక, వేదమాతృ హృదయమునకు వైరుధ్యము లేక, మన పూర్వర్షి పుంగవులు మన కందించినారు. ''నానృషిః కురుతేకావ్య'' మ్మనుదాని నన్వర్థము సేయు పొంటె, ఋషి హృదయమును గుర్తించి 'ఋ' సత్యమున, 'షి' మున్గిన, సిద్ధహస్తులు, గద్య పద్యాత్మకముగ ననేక కృతులాంధ్రులకుఁ జింతామణి కల్పవృక్ష కామదేనువులం బోలిన వానిని శ్రీ శ్రియానందనాథులు సమకూర్చిరి. శారదాంబకు హిరణ్మయమ్ములైన మేలిసొమ్ములు తీర్చి దిద్దుటలో వీరి పరిశ్రమము పండితజనైక వేద్యము. కర్మ బాహుళ్యస్ఫూర్జితము, గుప్తార్థము గర్భీకృతమునుగా గైర్వాణవాణి బహురూపముల, బహుభంగుల, శబ్ద శక్తి సామర్థ్యమ్మున నయఃపిండమట్లు కొఱుక రాకున్నది. అవిముక్తక్షేత్రమునకు గుప్తద్వారములైన యీసూక్తముల రహస్యములను సులభ##శైలి నాంధ్రలోకమున కందించి ''స్వయం తీర్ణః పరాంస్తారయతి'' యను నాచార్య మార్గాను సార మీ మహాశయుల కృతు లుల్లసిల్లుటంజేసి, సర్వత్ర సర్వుల కాదరణీయములై చెల్లుచున్నవి.

ఈ సూక్తరహస్యముల నామూలచూడముం జదివి యానందించి యీ నా యానందము నండు రెండక్షరములఁ బొందించితిని. పరదేవి శ్రీ శ్రియానందుల వాక్సిద్ధిగా మూర్తీభవించి, వారికి దీర్ఘాయుః సదారోగ్యము లిచ్చుగాత మని ప్రార్థింతును. ఇవే నా సహస్రనమోవాకములు.

''ఆనంద'' ''కృతి''

***

శ్రీమత్పరదేవతాయైనమః

బ్రహ్మశ్రీ, శ్రీ శ్రియానందనాథాపరనాములును,

ఈశ్వర సత్యనారాయణశర్మ మహాకవి, కృతుల

కానందభావసరణి. త్రయి -

೧. ఆయతకాయధీధనము నంబకునై రుచిమీఱఁ గూర్చునా

చాయల తేట తెన్గునుడి చల్వలు పేరిన వెన్నెలౌచు, వై

హాయసవీథిఁ గీర్తి సుమహాసము లీశ్వరవంశ్యసత్యనా

రాయణన్దర్మచిర్నగవురాజిలునాంధ్రులపుణ్య మోయనన్‌.

೨. రచియించినారలు, రుచిమీఱ ''నమ్మతో

ముచ్చటల్‌'' కృతికన్య ముచ్చటపడ;

వెలయించినారలు, కుల బాల ''అంబిక

శతకమ్ము'' నోరూరఁ జవులుచిల్క;

అనువదించితిరి, పూజ్యాదిశంకరకృతి

''సౌందర్యలహరి'' నిష్కలుషఫణితి;

అందించితిరి, మృదు లాంధ్రపద్యమ్ముల

శ్రీ దేవినుతిమాల, చిన్మయమ్ము;

ధన్యులైతిరి, కాళిదాసుని ''శ్రీదేవి

పంచస్తవిం'' దెల్గుపద్దెల నిడి;

సౌరశ్రీసూక్తులాగమసమ్మతముగ

నరసి మథియించి నవనీతమందఁజేసి

రంజనమ్మది. యజ్ఞాన మవలఁద్రోసి

జ్ఞాననిధిఁజూపు నేకైక సాధనమ్ము.

3. సత్యనారాయణాఖ్యతో సత్యపథము

దర్శనముగాఁగఁగంకటధారణమ్ము

మీదు కృతిమాలికాకృతి మేల్మిసొమ్ము

ధన్యులరు మీరు సత్కృతి ధారణమున

ఆత్మ తను జడిమల మాన్చు సమృత మదియ.

''ఆనంద''

-*-

Sri suktha Rahasyardha pradeepika    Chapters